Sunday, August 14, 2022

India 75 years independance

Happy independance day for all fellow country men and women. I have deep gratitude towards India for providing freedom, education, culture, people and values what made me what I am today. Fortunate for living and witnessing this milestone for the country. జొహార్ ! జొహార్ ! భారతమాతా జొహార్! జొహార్ ! జొహార్! శారద శుభ్ర వియత్తల పధమున సంచరించు నీ రథము. నీ మృదు వీణాగాన ప్రబుద్ధము నిత్యము మా మనము. జొహార్ ! జొహార్ ! భారతమాతా జొహార్! జొహార్ ! జొహార్! ప్రత్యుషలక్ష్మీ మకుటమణి ప్రభ బాసె తమోగణము. నీపదపంకజ నూపుర ఝుంకృతి నిద్రావిరహితము. జొహార్ ! జొహార్ ! భారతమాతా జొహార్! జొహార్ ! జొహార్! విప్లవ ఝంఝా విచలిత జీవన వీచి నికాయమున. స్థిర విజయోడుప కర్ణ ధారణము సేయుమ శౌర్యమున. జొహార్ ! జొహార్ ! భారతమాతా జొహార్! జొహార్ ! జొహార్! ముకుళిత హస్తులు నీ ప్రియపుత్రులు మోదదృష్టి గనుము. నీకరుణామృత నిర్ఘరపూరము నింపు మమ్మ సతము. జొహార్ ! జొహార్ ! భారతమాతా జొహార్! జొహార్ ! జొహార్! నీపదపీఠిని ప్రాణసుమంబులు నిల్పి భజించెదము. గర్హిత దాస్య భరంబును మాన్పి సుఖంబులు మా కిడుము. - Duvvuri Rami Reddy.

No comments: