Showing posts with label jndia. Show all posts
Showing posts with label jndia. Show all posts
Sunday, August 14, 2022
India 75 years independance
Happy independance day for all fellow country men and women.
I have deep gratitude towards India for providing freedom, education, culture, people and values what made me what I am today. Fortunate for living and witnessing this milestone for the country.
జొహార్ ! జొహార్ ! భారతమాతా జొహార్! జొహార్ ! జొహార్!
శారద శుభ్ర వియత్తల పధమున సంచరించు నీ రథము.
నీ మృదు వీణాగాన ప్రబుద్ధము నిత్యము మా మనము.
జొహార్ ! జొహార్ ! భారతమాతా జొహార్! జొహార్ ! జొహార్!
ప్రత్యుషలక్ష్మీ మకుటమణి ప్రభ బాసె తమోగణము.
నీపదపంకజ నూపుర ఝుంకృతి నిద్రావిరహితము.
జొహార్ ! జొహార్ ! భారతమాతా జొహార్! జొహార్ ! జొహార్!
విప్లవ ఝంఝా విచలిత జీవన వీచి నికాయమున.
స్థిర విజయోడుప కర్ణ ధారణము సేయుమ శౌర్యమున.
జొహార్ ! జొహార్ ! భారతమాతా జొహార్! జొహార్ ! జొహార్!
ముకుళిత హస్తులు నీ ప్రియపుత్రులు మోదదృష్టి గనుము.
నీకరుణామృత నిర్ఘరపూరము నింపు మమ్మ సతము.
జొహార్ ! జొహార్ ! భారతమాతా జొహార్! జొహార్ ! జొహార్!
నీపదపీఠిని ప్రాణసుమంబులు నిల్పి భజించెదము.
గర్హిత దాస్య భరంబును మాన్పి సుఖంబులు మా కిడుము.
- Duvvuri Rami Reddy.
Subscribe to:
Posts (Atom)